హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ చెరువు కట్టపై ఉన్న శ్రీశ్రీ కట్ట మైసమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో మళ్లీ ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు జ్ఞానేంద్ర ప్రసాద్, నాయకుడు రవికుమార్ యాదవ్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆలయ పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్షాల వల్ల ఆలయం కూలిపోయిందని, కానీ పనులను మళ్లీ ప్రారంభించామని తెలిపారు. ఆలయానికి పూర్వ వైభవం వస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట డివిజన్ బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్ రావు, నాయకులు బోయిని మహేష్ యాదవ్, రవి గౌడ్, రవి ముదిరాజ్, ఎన్. ఎం.నవీన్ కుమార్, కె. సాయి గౌడ్, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి రఘునాథ్ యాదవ్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ అభ్యర్థి ఎల్లేష్, హఫీజ్ పేట గ్రామస్తులు తలారి భూమయ్య, తలారి సాయిలు, తలారి క్రిష్ణ, తలారి వెంకటేష్ పాల్గొన్నారు.