మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలో ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురు కాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు విశేషంగా కృషి చేస్తున్నామని డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని సాయినగర్ దుర్గా మాత మందిరం వెనకాల నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను, సాయినగర్ తండాలో నూతనంగా నిర్మించి పూర్తయిన సీసీ రోడ్డు పనులను జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. డివిజన్ పరిధిలోని ప్రతి బస్తీ, కాలనీలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు సహదేవ్, రాఘవరెడ్డి, గోపాల్ నాయక్, సాంబయ్య, లక్ష్మణ్ నాయక్, ప్రభు, జగదీష్, యూత్ నాయకులు గోపాల్, కిట్టు శివ నాయక్, సుబ్బు, నీలేష్ నాయక్, గణేష్, వర్క్ ఇన్స్పెక్టర్ చారి పాల్గొన్నారు.