శేరిలింగంపల్లి, అక్టోబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో జనాభాలో సగం కంటే కూడా అత్యధిక పేదరికం కలిగిన దేశం మన భారతదేశం అని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ అన్నారు. పేదరికం పోవాలంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పేదరికం పోవాలంటే నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని, ఉచిత నాణ్యమైన వైద్యం అందించాలని, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సమాజంలో అసమానతలు పోవాలని అన్నారు. పేదరికం పోవాలంటే పేదలకు, వెనుకబడిన వర్గాలకు వ్యాపార రంగంలో పెట్టుబడులను అందించాలన్నారు. ప్రభుత్వాలు పేదరికం పోవాలంటే పేదలు, ధనికుల మధ్య తేడాలు పోవాలని, అందరికీ గౌరవం దక్కాలని, ప్రభుత్వాలు పేదల పట్ల చిత్తశుద్ధితో అనేక పథకాలు ఆవిష్కరించి పేదల అభివృద్ధికి దోహదపడాలని అన్నారు.