శేరిలింగంపల్లి, మే 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మారబోయిన రవికుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డితో కలిసి గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు రవికుమార్ యాదవ్‌కు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేయాలని నాయకులు ఆకాంక్షించారు. మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ.. రవికుమార్ యాదవ్ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే నాయకుడని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఇలాంటి జన్మదిన వేడుకలు ముందుముందు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రవికుమార్ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.






