శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి బోనాల సందర్భంగా తారా నగర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. కమిటీ సభ్యులు రామచందర్, వీరేశం గౌడ్, మాణిక్యం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






