నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ముగ్గురు లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 6.10 లక్షల ఎల్ ఓ సీ పత్రాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన వారిలో చందానగర్ డివిజన్ దీప్తి శ్రీ నగర్ కు చెందిన కాంతమ్మ అత్యవసర చికిత్స నిమిత్తం రూ.3లక్షల ఎల్ఓసీ పత్రాన్ని, పీఏ నగర్‌కు చెందిన ఆంజనేయులుకు రూ. 2.50 లక్షల ఎల్ ఓ సీ, కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ కి చెందిన సూరయి అంతుల్ మునీబ్ కు రూ. 60వేల ఎల్ఓసీని అందజేసినట్లు తెలిపారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందని, అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఉందన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు సాంబశివరావు, గుమ్మడి శ్రీనివాస్, కాశినాథ్ యాదవ్, శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.