చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ పరిధిలోని మియపూర్ ఆల్విన్ కాలనీలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, ఐదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. జాగర్లమూడి జనార్దన రావు సౌజన్యంతో బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ.. మన ప్రాచీన సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీకలే పండగలని అన్నారు. ముఖ్యంగా పట్టణీకరణ నేపథ్యంలో రోజు రోజుకూ మన సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతున్నతరుణంలో భవిష్యత్తు తరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను అందజేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం హర్షించదగ్గ పరిణామం అన్నారు. ఈ ముగ్గుల పోటీల వల్ల మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయటానికి అవకాశం ఏర్పడతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వరలక్ష్మి, శివరామకృష్ణ, యూసుఫ్, స్థానిక మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీదేవి పాల్గొన్నారు.