రంగన్న కుంట చెరువును సుందరీకరిస్తాం – ప్రభుత్వ విప్‌ గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చెరువులను సుందరీకరించి అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని జాగృతి కాలనీలో గల రంగన్నకుంట చెరువు సుందరీకరణలో భాగంగా రూ.15 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న ఆర్ సీసీ రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.

రంగన్న కుంట చెరువు కట్టను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగన్న కుంట చెరువును సుందరీకరించి అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో ఒక వైపు కూలిపోయిన గోడ నిర్మాణానికి పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. రాబోయే వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గోడ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని సూచించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్, చిన్న పిల్లల ఆట స్థలం ఏర్పాటు చేసుకోవడం పట్ల కాలనీ వాసులను అభినందించారు.  కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు ఉట్ల కృష్ణ ,చాంద్ పాషా, జంగం గౌడ్, అశోక్ సాగర్, దశరథ్, సుబ్బయ్య యాదవ్, లక్ష్మణ్, రామకృష్ణ, జ్ఞాన్ తేజ, చంద్రశేఖర్, వాసు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రంగన్న కుంట సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ,‌ కార్పొరేటర్ హమీద్ పటేల్

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here