నమస్తే శేరిలింగంపల్లి: పరిసరాలను పరిశుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరవలేనివని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. చైల్డ్ ఫండ్ ఇండియా ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి డివిజన్ పారిశుద్ధ్య కార్మికులకు హైజనిక్ సానిటైజేషన్ కిట్స్ ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో పారిశుధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలు చేశారని అలాంటి వారి రుణం తీర్చుకోలేమని అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ ఇండియా కోఆర్డినేటర్, బీహెచ్ఈఎల్ రిటైర్డు సేఫ్టీ ఆఫీసర్, బస్తీ కమిటీ ప్రెసిడెంట్లు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.