రామ ప్రాణ ప్రతిష్ఠ వార్షిక పూజా కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ షాప్ అసోసియేషన్, జై శ్రీరామ్ గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ఒక సంవత్సరం పూర్తైన సందర్భంగా రామ ప్రాణ ప్రతిష్ఠ వార్షిక పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజా విధానాలతో పాటు అన్నప్రసాద వితరణను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు గంగల రాధాకృష్ణ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై తన తండ్రి గంగల నరసింహ యాదవ్ తో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గంగల రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మిక విలువలను కాపాడుతూ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. అన్నప్రసాద వితరణ ద్వారా సేవాభావాన్ని చాటిన నిర్వాహకుల ప్రయత్నం అభినందనీయం.. అని అన్నారు. అలాగే గంగల నరసింహ యాదవ్ మాట్లాడుతూ, శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వార్షికోత్సవాన్ని ఈ విధంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. యువత సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి పట్ల మరింత ఆసక్తి చూపుతూ ముందుకు సాగాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కొండాపూర్ షాప్ అసోసియేషన్, జై శ్రీరామ్ గ్రూప్ సభ్యులను వారు అభినందించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, షాప్ అసోసియేషన్ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here