నమస్తే శేరిలింగంపల్లి: రాజరాజేశ్వరీ కాలనీ వేల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం విజయ్ వర్మ సంతాప సభను ఏర్పాటు చేశారు. కాలనీ అధ్యక్షుడు విజయ్ కృష్ణ మాట్లాడుతూ అతి చిన్న వయసులో విజయ్ వర్మ మృతి భాదాకరమని అన్నారు. విజయ్ వర్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి మనో ధైర్యం కలిగించాలని భగవంతున్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కృష్ణ, ఉపాధ్యక్షుడు మధు ముదిరాజ్, కమిటీ సభ్యులు మద్దిలేటి యాదవ్, అజయ్ సింగ్, కాలనీ యూత్ సభ్యులు నరేష్ కుమార్, కృష్ణంరాజు, శేఖర్ యాదవ్, నారాయణ, శివానంద్, రవి సాగర్ రాజు ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
