నమస్తే శేరిలింగంపల్లి: అజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని డొయెన్స్ కాలనీ మెయిన్ రోడ్డులో గల స్వచ్ఛ టాయిలెట్ దగ్గర శానిటేషన్ సిబ్బంది పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. అపరిశుభ్రం చేయకుండా శానిటేషన్ సిబ్బంది పూలతో అలంకరించారు. పరిశుభ్రత విషయంలో ప్రజలు పూర్తి సహకారం అందించాలని శేరిలింగంపల్లి సర్కిల్ పారిశుద్ధ్య సిబ్బంది సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ పీ బాలరాజ్, ఎస్ ఎఫ్ ఏ లు నాగేశప్ప, బిక్షపతి గౌడ్, కృష్ణంరాజు, వినయ్ కుమార్, శివకుమార్, స్థానిక ప్రజలు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.