అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి: కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి బుధవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు శంకర్ నగర్, సత్య ఎన్‌క్లేవ్, ఫ్రెండ్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అక్కడ జరుగుతున్న డ్రైనేజీ, సీసీ రోడ్డు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పనుల అమలులో ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పనిలోనూ కచ్చితమైన నాణ్యత పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here