తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందించాలి: కసిరెడ్డి భాస్కరరెడ్డి

శేరిలింగంప‌ల్లి, జూన్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్‌పేట ప్రేమ్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరోహీ ఇంటర్నేషనల్ స్కూల్ ను బీజేపీ రాష్ట్ర నాయకుడు, జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించాలని అన్నారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థపై కార్పొరేట్ యాజమాన్యాల ప్రభావం పెరుగుతోందని, విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు అవసరమని పేర్కొన్నారు. పాఠశాల యజమాని దినేశ్ జైస్వాల్, ఉత్తర భారత సమాజం రంగారెడ్డి అర్బన్ జిల్లా కన్వీనర్ రాజ్ జైశ్వాల్‌లతో కలిసి పాఠశాలను ప్రారంభించిన కసిరెడ్డి భాస్కరరెడ్డి, తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్న దినేశ్ జైస్వాల్‌ను అభినందించారు.

విద్యార్థులను కేవలం పరీక్షల కోసం తయారు చేసే యంత్రాలుగా కాకుండా, విలువలతో కూడిన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉందని ఆయన అన్నారు. విద్యతోపాటు వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యత, దేశభక్తి వంటి విలువలను కూడా విద్యార్థుల్లో పెంపొందించేలా పాఠశాలలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here