ప్రైవేట్ పాఠ‌శాలల్లో అధిక ఫీజు వ‌సూళ్ల‌కు నిర‌స‌నగా మియాపూర్‌లో బిజెవైఎం ధ‌ర్న‌

  • ఫీజులు 50 శాతానికి తగ్గించాలని జ్ఞ‌నేంద్ర ప్ర‌సాద్‌, రఘునాథ్ యాద‌వ్‌ల డిమాండ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో అధిక ఫీజుల‌న వ‌సూళ్ల‌కు వ్య‌తిరేకంగా భారతీయ జనతా యువమోర్చా శేరిలింగంపల్లి అసెంబ్లీ ఆధ్వర్యంలో మియపూర్ సెయింట్ మార్టిన్ హై స్కూల్ వద్ద నిర‌స‌న ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, బీజేవైయం రాష్ట్ర కోశాధికారి మారబోయిన రఘునాథ్ యాదవ్‌లు మాట్లాడుతూ కరోనా సమయంలో సైతం ప్రైవేట్ స్కూల్స్ యాజ‌మాన్యాలు అధిక ఫీజులు వసూలు చేయడం దారుణమ‌ని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు 50 శాతానికి తగ్గించాలని, అధిక ఫీజులు వసూలు చేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. జీ.ఓ.నెంబర్.46 ను అమలు చేస్తామని రాష్ట్ర విద్య శాఖ మంత్రి ప్రకటనలకే తప్ప ఎక్కడ కార్యాచరణ మొదలు కాకపోవడం, తెరాస ప్రభుత్వ పాలనకు నిదర్శనమ‌న్నారు. కరోనా వల్ల ప్రజల ఆర్థిక స్థితిగతులు ఛిన్నాభిన్నమైన పరిస్థితుల్లో పలు పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత తొందరగా ఈ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై తగు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో బీజేవైయం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉదృతం చేస్తామ‌ని అన్నారు.

మియాపూర్ సెంట్ మార్టీన్ ముందు ధ‌ర్నా చేస్తున్న బిజెపి, బిజేవైఎం నాయ‌కులు

బీజేవైయం రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్ అధ్యక్షతన జ‌రిగిన‌ ఈ కార్యక్రమంలో నాయ‌కులు రాధాకృష్ణ యాదవ్, శ్రీధర్ రావు, మాణిక్యారావు, రాజు శెట్టి, శ్రీశైలం కురుమ, రవి గౌడ్, నిరటి చంద్రమోహన్, సాయి, శివ గౌడ్ ,రాజేందర్ రెడ్డి, కుమార్ సాగర్, లక్ష్మణ్, మధు చారి, ఆనంద్, శివ కుమార్, నవీన్ రెడ్డి, మధుసూదన్ రావు, క్రాంతి, శిరీష రెడ్డి, ప్రధాన కార్యదర్శి స్వప్న రెడ్డి, మున్నూర్ సాయి, అచ్యుత్ రెడ్డి, రాఘవేంద్ర, సాయి సుకుమార్ పటేల్, మణ్యం, శ్రీను, భాస్కర్, నరేష్, మంజు, శ్రావణ్ కుమార్, శివ, మహేశ్, కుమార్, కరణ్, నర్సయ్య, నరసింహ, శ్రీకాంత్, రాజు, కృష్ణ, రంజిత్ రెడ్డి, ప్రశాంత్, సాయిలు, చిన్న సదర్, మహెష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here