నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా యువమోర్చ రంగారెడ్డి (అర్బన్) జిల్లా కార్యదర్శిగా నియమితులైన సాయికుమార్ గంగపుత్రను బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీకాంత్ గౌడ్ శనివారం సన్మానించారు. బిసీవర్గం నుంచి సాయికుమార్ కు జిల్లా యువమోర్చ కార్యావర్గంలో అవకాశం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శ్రీకాంత్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో సాయి కుమార్ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.