శేరిలింగంపల్లి, నవంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మయూరి నగర్ సబ్ స్టేషన్ 11కేవీ లక్ష్మీ నగర్ ఫీడర్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు హైదర్ నగర్ ఏఈ ఒక ప్రకటనలో తెలిపారు. ఫీడర్ పరిధిలో ఈహెచ్‌టీ లైన్లకు చేపట్టనున్న మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని అన్నారు. ఈ క్రమంలోనే ఫీడర్ పరిధిలో ఉన్న రత్నదీప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లైన్, నమహా అపార్ట్‌మెంట్స్, బుద్ధ అపార్ట్ మెంట్స్, డోవా కాలనీలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని అన్నారు. వినియోగదారులు విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాన్ని గమనించి సహకరించాలని కోరారు.





