శేరిలింగంపల్లి, ఏప్రిల్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వం ప్రతిష్టాత్మికంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో జీహెచ్ఏంసీ శానిటేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కొండాపూర్ డివిజన్ మార్తాండ్ నగర్ కాలనీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలతో కలసి శేరిలింగంపల్లి జోనల్ డిప్యూటీ కమిషనర్ సేవా ఈస్లావత్, కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా వీధుల్లో ఉన్న చెత్త తీసివేయటం, రోడ్లపై పేర్కొన్న మట్టి, ఇసుకను తొలగించటం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. దాదాపు 40 మంది శానిటేషన్ సిబ్బందితో కలసి రోడ్లను శుభ్రపరిచారు.

ఈ సందర్బంగా మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని అన్నారు. డోర్-టు-డోర్ చెత్త సేకరణలో శానిటేషన్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని అన్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించడంలో శానిటేషన్ సిబ్బంది కృషి చేస్తున్నారని, రోడ్ల పై చెత్త పడేయకుండా, ప్రజలు సహకరించాలని కోరారు. C & D వేస్ట్ మేనేజ్మెంట్, నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను ఈ సందర్బంగా శానిటేషన్ సిబ్బంది తొలగించారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు కూడా జవాబుదారీతనంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు చేయూత అందివ్వాలని అన్నారు. మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య లోపాలను సరి దిద్దటానికి కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం పట్టణాలను క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చడమే అని అన్నారు. పరిశుభ్రమైన పరిసరాలు – ఆరోగ్యవంతమైన తెలంగాణ అనే లక్ష్యంతో 99 రోజుల శానిటేషన్ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సేవా ఈస్లావత్, కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్, డీఈ SWM ఆనంద్, శానిటేషన్ ఎస్ఆర్పీ రాజయ్య, ఎస్ఎఫ్ఏ నందు, వేణు, అచ్యుత్, విజయ్, సీనియర్ నాయకులు మహమ్మద్ అలీ, శ్రీనివాస్ చౌదరి, మంగళరాపు, తిరుపతి పటేల్, లక్ష్మి, మహమ్మద్ షబ్బీర్, రజనీకాంత్, ఎంఏ సర్తాజ్, మహమ్మద్ ముక్తార్, అభి అక్షయ్, మహమ్మద్ వసీం తదితరులు పాల్గొన్నారు.





