శేరిలింగంపల్లి, ఏప్రిల్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషి నగర్, ప్రశాంత్ నగర్, స్టాలిన్ నగర్, MA నగర్ కాలనీలలో నిర్వహించిన సైబరాబాద్ క్లీన్ స్వీప్ డ్రైవ్ (CCSD)లో భాగంగా డీసీ శశిరేఖ, మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, CMC అధికారులు, జలమండలి అధికారులు, కాలనీ వాసులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కాలనీలలో పేరుకుపోయిన చెత్తకుప్పలను తొలగించడం జరుగుతుందని, చెత్త సేకరణ కోసం ఒక్కో విభాగానికి ఒక ఆటో లేదా టిప్పర్ నిమగ్నమై ఉంటుందని తెలిపారు. కాలనీలలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం అని అన్నారు. కాలనీలలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో CMC అధికారులు, జలమండలి అధికారులు, నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






