శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ పరిధిలో పలు కాలనీల్లో ఆదివారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శశిరేఖ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది పలు పబ్లిక్ పార్కుల వద్ద స్వచ్ఛ్ సాథీలో కలిసి స్వచ్ఛ్ సండే కార్యక్రమం నిర్వహించారు. న్యూ ప్రశాంత్ నగర్ కాలనీలోని భగత్ సింగ్ ట్రీ పార్క్, ఆల్విన్ కాలనీలోని ఇంద్రా రెడ్డి పార్క్, దీప్తి శ్రీనగర్ పార్క్, మదీనాగూడలోని మైత్రి నగర్ పార్క్, జె పి నగర్ పార్క్ లలో స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎస్‌డబ్ల్యూఎం డీఈ వశీధర్, ఎస్ఎస్ శ్రీనివాస్, కాలనీ సంక్షేమ సంఘ సభ్యులు, ఎస్సార్‌పీలు మహేష్, కనకరాజు, ఎస్ఎఫ్ఏలు, ఆర్‌పీలు పాల్గొన్నారు.






