మియాపూర్ డివిజన్ లో ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, మార్చి 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ అరబిందో కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో వేడుకల‌ను ఘనంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళల కోసం వినోదాత్మక ఆటలు నిర్వహించారు. అందులో లెమన్ అండ్ స్పూన్, బ్యాలన్స్ బెలూన్, ఫిల్ ద వాటర్ బాటిల్, ట‌గ్ ఆఫ్ వార్ వంటి ఆటలు నిర్వహించి మహిళలను ఆనందపరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు ప్రకటించారు. అలాగే పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.5వేల విలువైన గిఫ్ట్, రెండవ బహుమతిగా రూ.3వేల‌ విలువైన గిఫ్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి గౌరవం, ప్రోత్సాహం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 కి పైగా సభ్యులు, కాలనీ మహిళలు, పిల్లలు, నివాసితులు, ఏ.ఆర్.పి. టీం సభ్యులు పాల్గొన్నారు.

ఆర్‌బీఆర్ కాంప్లెక్స్‌లో..

అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో ఆర్‌బీఆర్ కాంప్లెక్స్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు, పిల్లల కోసం పలు వినోదాత్మక ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ హాజరై మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వాటర్ బాటిల్ ఫిల్లింగ్, మ్యూజికల్ చైర్, ప్రొటెక్ట్ యువర్ బెలూన్, టగ్ ఆఫ్ వార్ వంటి ఆటలు నిర్వహించగా మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలలో విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.5వేల‌ విలువైన గిఫ్ట్, ద్వితీయ బహుమతిగా రూ.3వేల‌ విలువైన గిఫ్ట్ అందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here