అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

శేరిలింగంప‌ల్లి, మార్చి 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో 116వ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మియాపూర్ పరిధిలోని ముజఫర్ అమ్మద్ నగర్ లో భాగ్యమ్మ అధ్యక్షతన రాజ్యాంగం, మహిళా సాధికారత అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర కోశాధికారి తాండ్ర కళావతి హాజ‌రై జెండా ఆవిష్కరణ చేసి సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు వి.అనిత, ప్రధాన కార్యదర్శి అంగడి పుష్ప, సభ్యులు విమల, శివాని , సుల్తానా బేగం, గూడా లావణ్య , తుడుము పుష్పలత, కళాకారిణి విజయ, రజియా బేగం, పద్మ, అమృత, వీరమని, లక్ష్మి, ఏఐసిటియు రాష్ట్ర అధ్యక్షుడు తుడుం అనిల్ కుమార్, తుకారం నాయక్, పల్లె మురళి, కన్నా శ్రీనివాస్ తదితరులు హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.అనిత, అంగడి పుష్ప మాట్లాడుతూ మహిళలు తరతరాలుగా కొట్లాడి, పోరాటాలు చేసి రాజ్యాంగంలో అనేక హక్కులను పొందుపరచుకున్నార‌ని అన్నారు. అంతర్జాతీయంగా అనేక పోరాటాలలో కార్మికులకు కార్మిక చట్టాలు సాధించడంలో అనేక దేశాలలో హక్కులు , స్వాతంత్ర్య పోరాటాలలో మహిళలు ముందు భాగాన ఉండి ఉద్యమాలకు నాయకత్వం వహించి అనేక విజయాలను సాధించిన ఘనత మహిళలకు ఉంద‌న్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here