నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ – శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలు శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో ఘనంగా జరిగాయి. లింగంపల్లిలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ సెంటర్ లో ఆచార్య జయశంకర్ సార్ విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో జయశంకర్ సార్ పాత్ర మరవలేనిదని అన్నారు. తన జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేసిన మహోన్నతుడు అని, తెలంగాణ భావజాలంతో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టి స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. బంగారు తెలంగాణ దిశగా మనందరం తోడ్పాటు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, రామ్ చందర్, వార్డు మెంబర్ ఫర్వీన్ బేగం, గోవింద చారి, బసవయ్య, జి. రవి యాదవ్, గోపాల్ యాదవ్, రవీందర్, కిషోర్, మేడ్చల్ శ్రీనివాస్, పవన్ కుమార్, గోపికృష్ణ, సాయి కుమార్, మున్యా నాయక్, గఫార్, అజీమ్, శ్రీనివాస్ చారి, యాదగిరి, రజిని, సౌజన్య, భాగ్యలక్ష్మి, జయ, నర్సింలు, సుధాకర్, ముంతాజ్ బేగం, సత్తార్ బాయ్, అలీమ్, సత్యనారాయణ, నహీమ్, మాణిక్యం చారి, దివాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, జమ్మయ్య, యాదగిరి, రామచందర్, నాగేష్ అప్పా, ఏరియా కమిటీ మెంబర్లు, బూత్ కమిటీ మెంబర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జయశంకర్ సర్ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న శేరిలింగంపల్లి ‌కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here