పిల్లల్లో దాగిన సృజనాత్మకత స్ఫోర్ట్స్ మీట్ ద్వారా వెలికితీయవచ్చు : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన ప్రయివేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ 2021 కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన ప్రయివేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పిల్లలలో దాగిన సృజనాత్మకత వెలికితీసేందుకు తోడ్పడుతుందన్నారు. పిల్లలకు చదువు తో పాటు క్రీడలు ఎంతగానో ముఖ్యం అని, క్రీడలతో శారీరక శ్రమతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. పిల్లలు చదువుల తో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే మంచి భావి పౌరులుగా దేశానికి సేవలు అందిస్తారని తల్లిదండ్రులకు, దేశానికి మంచి పేరు తీసుకువస్తారని అన్నారు. విద్య అభివృద్ధి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది అని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్, భారతి నగర్ డివిజన్ అధ్యక్షుడు భాస్కర్, నాయకులు రవీందర్ రెడ్డి, అక్బర్ ఖాన్, శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన ప్రయివేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ అధ్యక్షుడు గాయం భీష్మారెడ్డి, కాకరపర్తి శ్రీనివాస్, కార్యదర్శి విజయకుమార్, కోశాధికారి లయన్ డా.బోరుసువెంకటేశ్వర రావు, సలహాదారులు అనీల్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.ఎన్. రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అరుకుల రామచంద్ర రెడ్డి, రాష్ట్ర కార్య నిర్వాహకుడు ఎస్.రాజేశ్వర రావు, ఉపాధ్యక్షుడు ఆచార్య, నోవా, ఫణి కుమార్, సైమన్, శ్రీనివాస్ రెడ్డి,పవన్,మధు బాబు, ప్రవీణ్, రత్న కుమారి, విజయ్ కుమార్, సుజీవన్ బాబు,యాంకర్ దివాకర్, నిజాం అలీ ఖాన్, భరత్ కుమార్, జిల్లా కార్యదర్శి సుధాకర్, రెహ్మాన్,ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here