మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేసిన ఏకైక నాయ‌కుడు ప్ర‌ధాని మోదీ: ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ చందానగర్ డివిజన్ మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహం నుండి బీహెచ్ఈఎల్ చౌరస్తా వరకు నిర్వహించిన నారీశక్తి వందన్ పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళా మోర్చా నాయకురాళ్లు, కార్యకర్తలతో కలిసి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ర‌వికుమార్ యాద‌వ్ మాట్లాడుతూ నారీశక్తిని గౌరవించే దేశమే నిజంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కొన్ని ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ గురించి మాటలు మాత్రమే వినిపించాయని, కానీ అమలు చేయడానికి ధైర్యం చూపిన ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమేనని అన్నారు. యావత్ మహిళా లోకానికి నిజమైన గౌరవం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, సీనియర్ నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, బుచ్చిరెడ్డి , శ్రీనివాసరెడ్డి, రవీందర్ రావు, వసంత్ యాదవ్, పద్మ, రాధాకృష్ణ యాదవ్ , అనిల్ గౌడ్, లలితా రెడ్డి, విజయలక్ష్మి, కాంచన కృష్ణ, గోవర్ధన్ గౌడ్, జితేందర్, మహేష్ యాదవ్, గణేష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here