శేరిలింగంపల్లి, మార్చి 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పలు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. టౌన్ ప్లానింగ్‌లో 6 ఫిర్యాదులు రాగా ఇంజినీరింగ్ విభాగంలో 1 మొత్తం 7 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.






