హ‌ఫీజ్‌పేట‌లో ప‌వ‌ర్ లిఫ్టింగ్ పోటీలు

శేరిలింగంప‌ల్లి, మార్చి 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పవర్ లిఫ్టింగ్ క్రీడలను ప్రోత్సహించాల‌నే ఉద్దేశంతో హఫీజ్ పేట్ లో WRPF సంస్థ ఆధ్వర్యంలో, డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ సహకారంతో పోటీల‌ను నిర్వ‌హించారు. ఈ పోటీల్లో పవర్ లిఫ్టింగ్, డెడ్‌లిఫ్ట్, బెంచ్ ప్రెస్ వంటి విభాగాలలో మహిళలు, పురుషులు రెండు విభాగాల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మియాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ హాజ‌రై క్రీడాకారులకు మెడల్స్, నగదు బహుమతుల‌ను ప్రధానం చేశారు. అనంత‌రం ఆయ‌న‌ మాట్లాడుతూ క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి, క్రమశిక్షణకు, శారీరక దృఢత్వానికి ఎంతో ముఖ్యమని అన్నారు. ఇటువంటి పోటీలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయడానికి సహాయపడతాయ‌న్నారు. భవిష్యత్తులో ఇలాంటి క్రీడా కార్యక్రమాల‌ను విస్తృతంగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై కృష్ణ గౌడ్, ఎర్ర మహేష్, హరి, అభిలాష్, ఇందు, తిరుపతి, మనోజ్ యాదవ్, అఖిల్ యాదవ్, లక్ష్మణ్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here