పోస్ట‌ల్ టేబుల్ టెన్నిస్ టోర్నీ.. తెలంగాణ‌పై ఏపీ జ‌ట్టు గెలుపు..

ఆబిడ్స్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆబిడ్స్‌లోని ఫతే మైదాన్‌ లాల్‌ బహదూర్‌ ఇండోర్‌ స్టేడియంలో తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఆలిండియా పోస్టల్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే గురువారం టోర్నీలో టీమ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఇందులో పశ్చిమ బెంగాల్‌ పురుషుల జట్టు అస్సాంపై 3-2 తేడాతో గెలుపొందింది. అలాగే మహిళల విభాగంలో గుజరాత్‌ టీం పశ్చిమ బెంగాల్‌ టీంపై 3-2 తేడాతో గెలుపొందింది. అదేవిధంగా వుమెన్స్ డ‌బుల్స్ పోటీలు నిర్వ‌హించ‌గా అందులో ఏపీ జ‌ట్టు తెలంగాణ‌పై 3-1 తేడాతో గెలుపొందింది. ఈ సందర్భంగా విజేతలను పలువురు అభినందించారు.

పోస్ట‌ల్ టేబుల్ టెన్నిస్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్న ఏపీ, తెలంగాణ మ‌హిళా క్రీడాకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here