భార్య మీద అనుమానంతో దారుణంగా హ‌త్య చేసిన భ‌ర్త

గ‌చ్చిబౌలి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భార్య మీద అనుమానంతో ఓ వ్య‌క్తి ఆమెపై దాడి చేసి దారుణంగా హ‌త్య చేశాడు. గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.

ఫ‌ర్హానా ఖురేషీ మృత‌దేహం

మ‌హారాష్ట్ర‌లోని నాందేడ్ జిల్లా కిన్వ‌త్ గ్రామం ఇస్లాంపు కాల‌నీకి చెందిన ఫ‌ర్హానా ఖురేషీ(25)కి రెండు వివాహాలు అయ్యాయి. ముగ్గురు సంతానం క‌లిగారు. కాగా ఆమె త‌న ఇద్ద‌రు భర్త‌ల‌ను వ‌దిలేసి ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి గ‌చ్చిబౌలిలోని అంజ‌య్య‌న‌గ‌ర్‌లో నివాసం ఉంటోంది. క‌ర్ణాట‌క రాష్ట్రంలో త‌న స్నేహితులు ఉండ‌డంతో ఆమె అప్పుడ‌ప్పుడు అక్క‌డికి వెళ్లేది. కాగా ఆ రాష్ట్రంలోని బీద‌ర్ జిల్లా హొమ్నాబాద్ తాలూకా నిర్నా గ్రామానికి చెందిన మ‌హ‌మ్మ‌ద్ మోహ్‌సిన్ ఖాన్ (31)కు ఫ‌ర్హానా ఖురేషీతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది కాస్తా ప్రేమ‌కు దారి తీసింది. దీంతో వారు కొంత కాలం పాటు స‌హ‌జీవ‌నం చేశారు.

నిందితుడు మోహ్‌సిన్‌ఖాన్

ఆ త‌రువాత 5 నెల‌ల కింద‌ట ఫ‌ర్హానా, మోహ్‌సిన్‌ఖాన్‌లు ఇద్ద‌రూ వివాహం చేసుకుని అంజ‌య్య‌న‌గ‌ర్‌లో గ‌ది అద్దెకు తీసుకుని పిల్ల‌ల‌తో క‌లిసి జీవించ‌డం మొద‌లు పెట్టారు. మోహ్‌సిన్‌ఖాన్ కిరోసిన్ డీల‌ర్‌గా ప‌నిచేయ‌డం ప్రారంభించాడు. అయితే ఫ‌ర్హానా మీద మోహ్‌సిన్‌ఖాన్‌కు అనుమానం వ‌చ్చింది. త‌న భార్యకు ఇంకెవ‌రో పురుషుల‌తో సంబంధాలు ఉన్నాయ‌ని అత‌ను అనుమానించాడు. దీంతో ఈ విష‌య‌మై ఇద్ద‌రికీ త‌రచూ గొడ‌వ‌లు జ‌రుగుతుండేవి. ఈ క్ర‌మంలోనే ఈ నెల 20వ తేదీన రాత్రి 11 గంట‌ల‌కు ఇద్ద‌రికీ ఈ విష‌యంపై మ‌ళ్లీ గొడవ జ‌రిగింది. అయితే ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ తీవ్ర‌త‌రం కావ‌డంతో ప‌ట్ట‌రాని కోపం వచ్చిన మోహ్‌సిన్ ఖాన్ ఆవేశంతో ఇంట్లో ఉన్న క‌త్తితో ఫ‌ర్హానా మీద దాడి చేశాడు. ఆమెను క‌డుపులో పొడిచాడు. అనంత‌రం గొంతు కోశాడు. దీంతో ఆమె తీవ్ర గాయాల‌కు గురై అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో వారు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఫ‌ర్హానా మృత‌దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించి మోహ్‌సిన్ ఖాన్‌ను అరెస్టు చేసి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here