మ‌క్తా మ‌హ‌బూబ్‌పేట అంగ‌న్‌వాడీ కేంద్రాల‌లో పోష‌ణ్ అభియాన్ కార్య‌క్ర‌మం

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు ప‌రిధిలోని ఆదిత్య‌న‌గ‌ర్ సెక్టార్ ప‌రిధిలో ఉన్న మ‌క్తా మ‌హ‌బూబ్‌పేట అంగ‌న్‌వాడీ కేంద్రాల‌లో పోష‌ణ్ అభియాన్ కింద సామూహిక శ్రీ‌మంతాలు, అన్న‌ప్రాస‌న‌, సుపోష‌న్‌, అక్ష‌రాభ్యాసం, ఆరోగ్య దివ‌స్ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐసీడీఎస్ డీడ‌బ్ల్యూవో అధికారిణి శ్రీ‌ల‌త‌, సీడీపీవో క‌విత‌, సూప‌ర్ వైజ‌ర్ స్వాతి, మాధురి, అంగ‌న్ వాడీ టీచ‌ర్లు పాల్గొన్నారు. అంగ‌న్ వాడీల‌లో విద్యాభ్యాసం అనంత‌రం చిన్నారుల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చేర్పించాల‌ని అన్నారు. అంగ‌న్ వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే పౌష్టికాహారాన్ని అంద‌రూ సద్వినియోగం చేసుకోవాల‌ని అన్నారు. త‌ల్లి గ‌ర్భంలో ఉన్న‌ప్ప‌టి నుంచి స‌మ‌తుల్య ఆహారం, పోష‌కాలు ఎక్కువ‌గా ఉండే ఆహార ప‌దార్థాల‌ను తీసుకుంటే పుట్ట‌బోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంద‌ని తెలిపారు. 7 నెల‌ల నుంచి పిల్ల‌ల‌కు బాలామృతం తినిపించాల‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌కంతా మ‌హ‌బూబ్ పేట అంగ‌న్ వాడీ టీచర్ మౌనిక త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here