శేరిలింగంపల్లి, ఆగస్టు 5 (నమస్తే శేరిలింగంపల్లి): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల విలేజ్ అపర్ణ సైబర్ జోన్ లో స్థానిక సీనియర్ సిటిజెన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని అన్నారు. మొక్కలు నాటితే మన భావి తరాలకు చక్కని వాతావరణాన్ని అందించిన వారమవుతామని, వారి ఆరోగ్యానికి బాటలు వేసిన వారమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు బొల్లంపల్లి విజయ్‌భాస్కర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజన్, సిద్ధార్థ బాబు, సాయినాథ్, వంశీ కోట్ల, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.






