శేరిలింగంపల్లి, ఆగస్టు 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని లింగంపల్లి విలేజ్ కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపులో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అంగ రంగ వైభవంగా అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు నిర్వహించుకోవడం సంతోషకరమని తెలిపారు. ఊరేగింపును కుల మతాలకు అతీతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో SLVDC ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, గౌరవ అధ్యక్షుడు సోమయ్య యాదవ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, కమిటీ జనరల్ సెక్రటరీ దేవులపల్లి శ్రీనివాస్, పాశం రాజు, గౌరవ అధ్యక్షుడు మేకల కృష్ణ, ప్రణయ్ ముదిరాజ్, బుయ్య మల్లేష్ గౌడ్, శ్రీనివాస్, సూర్య రాథోడ్, పిల్లి అనిల్, రవి, నవీన్ గౌడ్, విలేజ్ కమిటీ మెంబర్స్, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.






