శేరిలింగంపల్లి, ఆగస్టు 5 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ మియాపూర్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి పారిశుధ్య సూపర్ వైజర్లతో కలిసి PPE కిట్లను పారిశుధ్య సిబ్బందికి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు నిరంతరం పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివని, అన్ని కాలాల్లో విధులను నిర్వహించే సందర్భంగా పారిశుధ్య సిబ్బంది పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికి అన్నివిధాలుగా ఉపయోగపడే విధంగా సబ్బులు, నూనె, శానిటైజర్, మాస్కులు, టోపీలు, గ్లౌజులు మొదలైన వస్తువులతో కూడిన వ్యక్తిగత రక్షణ పరికరాలతో కూడిన కిట్లను జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బందికి ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున వాటిని పారిశుద్ధ్య సిబ్బందికి పంపిణీ చేయడం జరిగిందని, సమయానుకూలంగా కిట్‌లోని రక్షణ వస్తువులను వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, విధులను చిత్తశుద్దితో నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య సూపర్ వైజర్ లు కనకరాజు, మహేష్, ఆగమయ్య, వినయ్ తదితరులు పాల్గొన్నారు.






