శారీరక వ్యాయామంతో చిన్నారుల్లో మానసికోల్లాసం – చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శారీరక వ్యాయామంతో చిన్నారులు మానసికంగా దృఢంగా తయారవుతారని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో సమ్మర్ క్యాంపులో భాగంగా నిర్వహించిన వాలీబాల్, స్కేటింగ్, క్రికెట్, బ్యాడ్మింటన్ క్రీడల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి బహుమతులు అందజేశారు.

పీజేఆర్ ‌స్టేడియంలో కోచ్ లకు బహుమతులను అందజేస్తున్న కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్న వాలీబాల్ కోచ్ అశోక్ రెడ్డి, క్రికెట్ కోచ్ ఎండి హుసేన్ ఉద్దిన్, బ్యాడ్మింటన్ కోచ్ మహేష్, స్కేటింగ్ కోచ్ నవీన్ లను సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో రాణించే వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోన్ గేమ్స్ ఇన్‌స్పెక్టర్ వీరానంద్, టీఆర్ఎస్ నాయకులు వరలక్ష్మి రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

క్రీడల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులతో చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here