నమస్తే శేరిలింగంపల్లి: రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన దీవకొండ దామోదర్ రావు, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఎమ్మెల్సీ తాత మధు, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి నూతనంగా రాజ్యసభకు ఎంపికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.