బహుజనులంతా ఏకం కావాలి : భేరి రామచందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అంబర్‌పేట్ మహారాణ ప్రతాప్ మినీ హాల్‌లో అంబర్‌పేట్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన అఖిల భారత బహుజన సేన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటిన కూడా బహుజనులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పేదరికంలో మగ్గి ఇప్పుడున్న పార్టీల జెండాలు మోసి జిందాబాద్‌లు కొట్టి బానిసలుగా బ్రతుకుతున్నార‌ని అన్నారు. ఇత‌ర పార్టీల‌కు బానిస‌లుగా బ‌త‌క‌కుండా మ‌న ఓట్ల‌ను మ‌న‌మే వేసుకోవాల‌ని, బీసీలు అధికారంలోకి వ‌చ్చేందుకు శ్ర‌మించాల‌ని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు కుమార్ యాదవ్, యూత్ అధ్యక్షుడు చంద్రశేఖర్, పెళ్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here