శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని PJR ఎన్‌క్లేవ్ రోడ్డులో ఉన్న శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పూజ, అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వాములకు అన్న ప్రసాదాలు వడ్డించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో , శాంతి సౌభాగ్యలతో జీవించాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఓ వెంకటేష్, కాజా, జర్నలిస్టు మల్లేష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






