కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా తెరాస నేతలకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. సోమవారం ఆయన కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండనగర్, హనీఫ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన తెరాస పార్టీ కార్యాలయాన్ని డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి హమీద్ పటేల్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రతి ఒక్కరినీ కలుపుకుని ప్రచారంలో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులే అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు తెరాసను విశేషంగా ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తెరాస నాయకుడు మహేందర్ ఆధ్వర్యంలో సుమారుగా 200 మంది మార్వాడీలు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. అందరికీ తెరాస పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెరాస పార్టీలో చేరిన వారిలో వినోద్ గుప్తా, వినోద్ యాదవ్, చంద్రభాను, అనిరుద్ వర్మ, రింకు జైస్వాల్, శంషాద్ అలీ, విజయ్ వర్మ, హలీం, సంతోష్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, శ్రీనివాస్ చౌదరి, తిరుపతి, బాబూమియా పాల్గొన్నారు.








