ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్‌లో పూర్తి చేసిన 1400 మంది పట్టభద్రుల ఓటరు నమోదు పత్రాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, వార్డు సభ్యులు కాశీనాథ్ యాదవ్, చిన్నోళ్ళ శ్రీను, మౌలాన, నాయకులు వెంకట్ నాయక్, కుమారి, ఫారూక్, కలీమ్ పాల్గొన్నారు.