జూన్ 3 నుంచి పట్టణ ప్రగతి ప్రారంభం – సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేలా కృషి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. బషీర్ బాగ్ లోని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రేనింగ్ సెంటర్ భవనంలో పట్టణ ప్రగతి పై సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అంజయ్య యాదవ్, కలెక్టర్ అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని మాట్లాడారు.

సమీక్ష సమావేశంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, విప్‌ గాంధీ

జూన్ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పట్టణ ప్రగతి పై దిశ నిర్దేశం చేశారు. శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిల్ లో 27 బృందాలు పనిచేస్తాయని, ఒక్కొక్క బృందానికి ఐదుగురు సభ్యులు విధులు నిర్వహిస్తారని చెప్పారు. ప్రతి బృందానికి ఒక లారీ, టిప్పర్ ఉంటుందని, ప్రతి కాలనీలో జూన్ 18 వ తేదీ వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. మణికొండ లోని పంచవటి కాలనీ లో ప్రజల సౌకర్యార్థం నడిచేందుకు వీలుగా నాలా పై వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ విప్ గాంధీ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రతిపాదనలు పంపిస్తే వెంటనే మంజూరి చేసి పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా లోని వివిధ కార్పొరేషన్ల, మునిసిపాలిటీల మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here