మొవ్వా సత్యనారాయణను పరామర్శించిన రాష్ట్ర కమ్మ సేవా సమితి

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణపై దాడి‌‌ హేయమైన చర్య అని తెలంగాణ కమ్మ సేవా సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లిలో కబ్జాకు గురైన చెరువు సందర్శన సందర్భంగా రౌడీ మూకల దాడికి పాల్పడిన తెలంగాణ కమ్మ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు మొవ్వ సత్యనారాయణ ను తెలంగాణ‌ కమ్మ సేవా సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు పరామర్శించారు. ఘటనకు‌ సంబంధించిన అంశంపై ఆరా తీశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో విద్యాసాగర్, గోపాలం, సాయిబాబా చౌదరి, ప్రేమ్ చంద్, ప్రసాద్ తదితరులు ఉన్నారు.

మొవ్వా సత్యనారాయణ ను పరామర్శిస్తున్న రాష్ట్ర కమ్మ సేవా సమితి సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here