శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జన సంఘ్ అధ్యక్షుడు, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ అధ్యక్షతన సేవా పక్షం డివిజన్ కో – కన్వీనర్ , మాజీ కౌన్సిలర్ రమణయ్య ఆధ్వర్యంలో హుడా కాలనీ ఫస్ట్ ఫేజ్, దుర్గా మాత ఆలయంలో దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఏక్ పేడ్ మాకే నామ్ నినాదంతో మొక్కలు నాటారు. హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఉపాధ్యాయుడిగా అవకాశం వచ్చినప్పటికీ బోధనా వృత్తినీ కాదని ఆర్ఎస్ఎస్ లో పూర్తిస్థాయిగా పనిచేసేందుకు తనను తాను అంకితం చేసుకోవడం జరిగిందన్నారు. ఆర్ఎస్ఎస్ లో విశేష సేవలందించి భారతీయ జనసంఘ్ అధ్యక్షుడిగా బిజెపి బలోపేతం కోసం నిరంతరం కృషి చేశారన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు దేవానంద్ యాదవ్ , రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ మాజీ అధికార ప్రతినిధి అజిత్ సేనాపతి, జిల్లా బీజేపీ మజ్దూర్ మోర్చా అధ్యక్షుడు ఆళ్ల వరప్రసాద్ , బీజేపీ నాయకుడు సత్యనారాయణ రాజు , హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షులు మారేళ్ళ వెంకటేశ్వర్లు , ప్రసాద్ పాత్రో , డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజ్ , బీజేపీ నాయకులు శ్రీనివాస్ , ప్రభాకర్ రెడ్డి, బాలరాజు , రామచంద్ర యాదవ్ , శ్రీకాంత్ , అశోక్ గౌడ్ , కిరణ్ ఇతరులు పాల్గొన్నారు.






