నమస్తే శేరిలింగంపల్లి: దేశంలోనే మొట్ట మొదటి సారిగా దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని, ఈ పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. రంజిత్ అన్న యువసేన బృందం, దళిత రాష్ట్ర నాయకులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు మంగళవారం ఎంపీ రంజిత్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో దళితుల కోసం దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రంజిత్ రెడ్డి పాలాభిషేకం చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా దళిత బంధు పథకం ద్వారా రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందజేయడం గర్వకారణం అన్నారు. యావత్తు దళితుల పట్ల సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంజిత్ అన్న యువసేన అధ్యక్షుడు అశిల శివకుమార్, నాయకులు ఎ. శ్యామ్ మోహన్, లోకేష్, రాజ్, అనిల్, మల్లేష్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.