నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ శివాలయం వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ ను బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ సదుపాయాలు కలిపిస్తున్నారని అన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం గురించి మోడీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ సామజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు, శానిటైజర్ ను తప్పకుండా వాడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు మాణిక్ రావు, బిఎస్ఎన్ ట్రస్ట్ చైర్మన్ కిరణ్ యాదవ్, నాయకులు లక్ష్మణ్, ప్రభాకర్, విజేందర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.