శేరిలింగంపల్లి, ఆగస్టు 29 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హఫీజ్పేట్ లో టీమ్ త్రిశూల్ వినాయక మండపం వద్ద నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు వినాయకుడు అని అన్నారు. అందుకే ఆయన్ను విఘ్నేశ్వరుడు అంటారు అని అన్నారు. ఎంతోమంది దేవుళ్లు ఉన్నప్పటికీ మొదట పూజలు అందుకునేది ఆయనే కాబట్టి ఆదిదేవుడుగా కొలుస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్ , మారబోయిన రాజు యాదవ్, ప్రసాద్, వెంకటేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, రాజు యాదవ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






