శేరిలింగంపల్లి, మే 5 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్ వరకు రూ.74 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న సర్వీస్ రోడ్డు విస్తరణ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను, చెరువుల ఇన్ లెట్ లను, నాలాలను CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ నుండి యశోద హాస్పిటల్ ముందు ఫ్లై ఓవర్ వరకు నిత్యం ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ట్రాఫిక్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సర్వీస్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరిగిందని, దీంతో ట్రాఫిక్ సమస్య తీరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు EE గోవర్ధన్, DE దుర్గ ప్రసాద్, వర్క్ ఇన్స్పెక్టర్ శర్మ, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






