మెట్ల బావి పార్క్‌ను ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ప్రారంభోత్స‌వం సందర్భంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాధవ హిల్స్ కాలనీలో రూ. 95 లక్షలతో అభివృద్ధి చేసిన మెట్ల బావి పార్క్ (STEP WELL PARK) ను మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ప్రారంభం సంద‌ర్భంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాధవ హిల్స్ కాలనీ లో రూ. 95 లక్షలతో అభివృద్ధి చేసిన మెట్ల బావి పార్క్ (STEP WELL PARK) ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. ఎన్నో ఏండ్ల పార్క్ ను సుందర శోభిత వనంగా తీర్చిదిద్దడం జరిగింద‌ని, మెట్ల బావి పార్క్ ను అన్ని హంగులతో సకల సౌకర్యాలతో పునరుద్ధరించడం జరిగింద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారబోయిన రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , పద్మారావు, తిరుపతి, మల్లేష్ యాదవ్, శశాంక్, విజయ్, దీపక్, పవన్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here