మా అమృతం కిచెన్ & కేటరింగ్ ప్రారంభం

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మా అమృతం కిచెన్ & కేటరింగ్ ను పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిధులుగా హాజ‌రై స్థానిక నాయకులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మా అమృతం కిచెన్ & కేటరింగ్ యాజమాన్యం శిరీష్, ప్రవీణ్ ల‌కి పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ శుభాకాంక్షలు తెలియజేశారు. మరిన్ని శాఖలుగా అభివృద్ధి చెందాలని ఈ సందర్బంగా ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సుద్దపల్లి విజయకృష్ణ, గోపాల్ రెడ్డి, మధు ముదిరాజ్, రమణ, శ్రీనివాస్, రాజ్, వినోద్, మంజు, హేమ, సరస్వతి, జోషి, యాదగిరి, హరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here