శేరిలింగంపల్లి, అక్టోబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్‌పేట్ డివిజన్ లోని ఓయూ కాలనీ ప్రాంతంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి బూత్ నంబర్ 26, 27 పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ నవంబర్ 11న జరగబోయే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజా శ్రేయస్సు, అభివృద్ధి, పారదర్శక పాలన కోసం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని, ఆయన విజయం ద్వారానే ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ మాత్రమే ప్రజలతో మమేకమై వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగల పార్టీ అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి దిశగా భారత్‌ను ముందుకు తీసుకువెళ్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం ప్రజలకు విశ్వాసం కలిగించింది. అదే మార్గంలో మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి ఓటు వేసి ప్రజలు తమ బాధ్యతను నిర్వర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివసింగ్ రాందీన్, సీనియర్ నాయకులు మీన లాల్ సింగ్, వసంత కుమార్ యాదవ్, స్వామి గౌడ్, నరసింహరావు, అనిల్ గౌడ్, నందు, వరలక్ష్మి ధీరజ్, నరేందర్ ముదిరాజ్, తిరుపతి, నరసింహ రాజు, సురేష్, దుర్గారామ్, రాఘవేంద్ర, గోపాల్ భారతి భాయ్, స్థానిక బీజేపీ నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





