శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ విద్యావాణి హై స్కూల్ వద్ద డ్రైనేజీ లీకేజ్ విషయమై బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం సంబంధిత అధికారులు, సిబ్బంది పనులు చేపట్టారు. ఈ సందర్భంగా పనులను విష్ణు దత్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రమణయ్య, దేవేందర్ రావు, వెంకటేష్ ముదిరాజ్, సతీష్, స్థానికులు పాల్గొన్నారు.






